![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -347 లో.....ఇదే రోజు మీ కూతురు చనిపోయిన రోజు.. ఇదే రోజు తన కొడుకు పుట్టినరోజు.. ఒక వైపు సంతోషం, ఒకవైపు బాధ.. ఇలాంటి సిచువేషన్ రాకుడదని పంతులు గారు అంటారు. మీ మనవడిని పిలవండి తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిద్దామని పంతులు అనగానే.. వాడికి తల్లి ప్రేమ ఏం తెలుసు నా కూతురికి నేను, నా కొడుకు చేస్తామని శ్రీలత అంటుంది.
ఆ తర్వాత రామ్ పుట్టినరోజు కి మమత వస్తుంది. రామ్ ఇంకా రెడీ అవ్వలేదా అని సీతాకాంత్ ని అడుగుతుంది. లేదు తన గురించి తెలుసు కదా.. వాళ్ళ మిస్ టీసీ ఇచ్చింది.. నేను అదే స్కూల్ కి వెళ్తాను.. మేడమ్ కావాలి అంటూ మారాం చేస్తూ కూర్చున్నాడని సీతాకాంత్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. హాయ్ అని మమత చెప్పగానే.. ఇంటికి వచ్చిన వాళ్లకు చెప్పాల్సింది హాయ్ కాదు వెల్ కమ్ అని రామలక్ష్మి అంటుంది. మీరు పిలిచారని రాలేదు.. పసి మనసు బాధపడకూడదని వచ్చానని రామలక్ష్మి అంటుంది. రామ్ ఎక్కడ అని రామలక్ష్మి అడుగుతుంది. మీరు వస్తే గానీ రానని పైన ఉన్నాడని సీతాకాంత్ అంటాడు. నాన్న మీ మిస్ వచ్చిందని చెప్పగానే.. రామ్ వస్తాడు. వెళ్లి రెడీ చేసి తీసుకొని వస్తానని రామ్ ని సీతాకాంత్ తీసుకొని వెళ్తాడు. సీతా గారు ఒక్కరే కష్టపడుతుంటే తల్లి అయి ఉండి పట్టించుకోవడం లేదని మమత గురించి రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ రెడీ చేస్తాడు.
రామలక్ష్మి అక్కడున్న శ్రీలత సందీప్, శ్రీవల్లీలతో మాట్లాడుతుంది. మీరేం చేస్తున్నారంటూ సందీప్ తో మాట్లాడుతుంది. పెద్ద వర్క్ చేస్తాడు. మా పెద్ద కొడుకు సంపాదించిన డబ్బులు రెట్టింపు చేస్తాడని శ్రీలత అంటుంది. మమతని అడిగి ఇల్లు చూస్తానంటూ రామలక్ష్మి వెళ్తుంటే.. ఇల్లు మనది కదా మమత అక్కని పర్మిషన్ అడుగుతుంది ఏంటని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మి పైకి వెళ్లి ఇల్లు చూస్తుంది. అక్కడే ఉన్న సిరి ఫోటో చూడదు. ఫోటో ఉన్న రూమ్ లోకి తను వెళ్ళబోతుంటే రామ్ వచ్చి మిస్ అని పిలుస్తాడు. ముగ్గురు కలిసి కిందకి వస్తుంటే.. వాళ్ళు ఆ బాబుకి అమ్మనాన్నలాగా అనిపిస్తున్నారని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |